ఒమన్ లో పౌరులు, నివాసితుల సెలవుల ప్రణాళికలు..!!

- November 25, 2025 , by Maagulf
ఒమన్ లో పౌరులు, నివాసితుల సెలవుల ప్రణాళికలు..!!

మస్కట్: ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు గత వారం  ప్రారంభమై కొనసాగుతున్నాయి. పౌరులు మరియు నివాసితులు ఇప్పుడు రాబోయే వీకెండ్ కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు.  నవంబర్ 26 నుండి  నవంబర్ 29 వరకు, ప్రజలు విహారయాత్రలకు వెళ్లాలని భావిస్తున్నారని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. నివాసితులు ఎక్కువగా ఒమన్ లో పర్వతాలు, ఎడారులను చూసేందుకు ఆసక్తిచ చూపుతున్నారని పేర్కొన్నారు. అయితే, వాతావరణం కాస్తా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జబల్ అఖ్దర్‌లోని దుసిట్ డి2 నసీమ్ రిసార్ట్ మంచి ప్యాకేజీని అందిస్తుంది.అల్పాహారం మరియు అడ్వెంచర్ పార్క్‌కు అపరిమిత యాక్సెస్ సహా, క్లైంబింగ్, రోప్స్ కోర్సు, 107 మీటర్ల జిప్‌లైన్, పాడెల్ సెషన్‌లు మరియు పిల్లల కోసం ఒక మినీ సినిమా హాల్ ఉన్నాయి.
ది వ్యూ ఒమన్ అల్ హమ్రా సమీపంలో ప్రత్యేక లగ్జరీ రిట్రీట్‌ను అందిస్తుంది. సముద్ర మట్టానికి 1,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఎకో-రిసార్ట్ సహజమైన ప్రశాంతతకు నిలయంగా ఉంది. అతిథులు ట్రెక్కింగ్, బైక్ లేదా సహజమైన ప్రకృతి దృశ్యాల ద్వారా హైకింగ్ చేయవచ్చు. జాతీయ దినోత్సవ ప్యాకేజీలు OMR 125 నుండి ప్రారంభమవుతాయి.    
ఇసుక ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు షార్కియా సాండ్స్‌లోని డెజర్ట్ నైట్స్ రిసార్ట్ హోటల్‌కు వెళ్లవచ్చు. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచితం. స్పా సేవలను 15% తగ్గింపుతో అందిస్తోంది. స్టార్‌లైట్ ఎడారి వాక్ నుండి డూన్ అడ్వెంచర్‌ల వరకు, రిసార్ట్ ఒమన్ బంగారు ఆకాశంలో మరపురాని సెలవుదినాన్ని ఆస్వాదించేలా ప్యాకేజీలను అందిస్తోంది.వీటితోపాటు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com