కటారా ఫాల్కన్రీ, హంటింగ్ ఛాంపియన్‌షిప్..!!

- November 25, 2025 , by Maagulf
కటారా ఫాల్కన్రీ, హంటింగ్ ఛాంపియన్‌షిప్..!!

దోహా: కటారా ఫాల్కన్రీ మరియు హంటింగ్ ఛాంపియన్‌షిప్ రెండవ ఎడిషన్ నవంబర్ 26 సీలైన్‌లోని మర్మి సబ్ఖాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఖతార్ ఫాల్కన్రీ అసోసియేషన్ ఛాంపియన్‌షిప్స్ డైరెక్టర్ మరియు మర్మి ఫెస్టివల్ ప్రెసిడంట్ ముతైబ్ అల్-ఖహ్తానీ వెల్లడించారు. అలాగే, ఛాంపియన్‌షిప్‌లో జరిగే వివిధ ఈవెంట్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రతి పోటీలో పాల్గొనేవారి సంఖ్య ఖరారు అవుతుందని, పోటీదారులలో డ్రా నిర్వహించి షెడ్యూల్ ఫైనల్ చేస్తారని ఆయన వివరించారు. ఈ ఛాంపియన్‌షిప్ నవంబర్ 26 న గ్రూప్ 1 నుండి 7 వరకు జరిగే ఫాల్కన్రీ పోటీకి అర్హత రౌండ్‌లతో ప్రారంభమవుతుందని ముతైబ్ అల్-ఖహ్తానీ వెల్లడించారు.

ఫాల్కన్రీ మొదటి రోజు “గైర్‌ఫాల్కాన్ చిక్” మరియు “గైర్‌ఫాల్కాన్-పెరెగ్రైన్ హైబ్రిడ్” విభాగాలలో పోటీకి అర్హత రౌండ్‌లు ప్రారంభమవుతాయన్నారు.  మరుసటి రోజు “గైర్‌ఫాల్కాన్ చిక్” మరియు “గైర్‌ఫాల్కాన్-పెరెగ్రైన్ హైబ్రిడ్” ఫాల్కన్రీ పోటీలకు అర్హత రౌండ్‌లతో పాటు, 8 నుండి 14 వరకు గ్రూపులకు ఫాల్కన్రీ పోటీకి అర్హత రౌండ్‌లు ఉంటాయని తెలిపారు.

ఇక నవంబర్ 28న 15 నుండి 20 గ్రూపుల వరకు జరిగే ఫాల్కన్రీ పోటీకి అర్హత రౌండ్లు జరుగుతాయన్నారు.  నవంబర్ 29న ఉదయం 21 నుండి 26 గ్రూపుల వరకు జరిగే ఫాల్కన్రీ పోటీకి అర్హత రౌండ్లు ఉంటాయని, డిసెంబర్ 1న  పలు విభాగాలలో ఫాల్కన్రీ పోటీల ఫైనల్స్ ఉంటాయని తెలిపారు. ఇక డిసెంబర్ 2, 3, 6వ తేదీన పలు విభాగాల్లో ఫాల్కన్రీ పోటీల ఫైనల్స్ జరుగుతాయని పేర్కొన్నారు.  మొత్తంగా ఫైనల్స్‌లో అత్యుత్తమ సమయాలు సాధించిన ఐదు ఫాల్కన్లు, మొత్తం 20 ఫాల్కన్లు, ఎలైట్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయని  వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com