విజిట్ వీసాలను రెగ్యులర్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చా?
- November 25, 2025
కువైట్: కువైట్ లో విజిట్ వీసాలను రెగ్యులర్ రెసిడెన్సీగా మార్చుకునే అవకాశం ఐదు రకాల కేసులలోనే సాధ్యం అవుతుందని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది. ఈ మేరకు మొదటి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ విదేశీయుల నివాసంపై డిక్రీ జారీ చేశారని వెల్లడించారు. ఇందులోని నిబంధనలలోని ఆర్టికల్ 16 ప్రకారం, విజిట్ వీసాను రెగ్యులర్ రెసిడెన్స్ పర్మిట్గా మార్చుకోవడానికి అనుమతించినట్లు తెలిపారు.
మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ విజిట్ వీసాపై వచ్చే వ్యక్తులకు అనుమతించారు. దీంతోపాటు విశ్వవిద్యాలయ డిగ్రీలు లేదా టెక్నాలజీ స్పెషలైజేషన్లు కలిగి ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఇందు కోసం నివాస వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఆమోదం పొందాలని సూచించారు.
ఇక ప్రారంభంలో విజిట్ వీసాపై ప్రవేశించిన గృహ కార్మికులకు వివిధ నిబంధనల ప్రకారం రెసిడెన్సీ వీసాగా మార్పు చేసేలా అవకాశం కల్పించారు. వీటితోపాటు రెసిడెన్స్ వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ సముచితంగా భావించిన అదనపు కేసులలో విజిట్ వీసాను రెగ్యులర్ రెసిడెన్స్ పర్మిట్గా మార్చుకునేందుకు అనుమతిస్తారని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







