ప్రవాస కార్మికుల నైపుణ్యాల మెరుగు పై సమీక్ష..!!

- November 25, 2025 , by Maagulf
ప్రవాస కార్మికుల నైపుణ్యాల మెరుగు పై సమీక్ష..!!

రియాద్ః సౌదీ అరేబియాలో విదేశీ కార్మికుల  నైపుణ్యాలను మెరుగుపరచడానికి సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల మండలి (CEDA) సమావేశం సమీక్షించింది. ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ మరియు ప్రొఫెషనల్ లైసెన్సుల అధ్యయనానికి సంబంధించి విద్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక మరియు ప్రణాళిక మంత్రిత్వ శాఖ, మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల సంయుక్త ప్రదర్శనను కౌన్సిల్ సమావేశం పరిశీలించింది. ప్రొఫెషనల్ వెరిఫికేషన్ ట్రాక్ ద్వారా రాజ్యంలోకి ప్రవేశించడానికి ముందు మరియు తరువాత సౌదీ కార్మిక మార్కెట్‌కు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని విదేశీ కార్మికులు కలిగి ఉన్నారని నిర్ధారించే క్యాబినెట్ తీర్మానం నంబర్ 195 అమలును పర్యవేక్షించారు.  

ప్రవాస కార్మికుల ప్రవేశాన్ని నియంత్రించడం, కార్మిక మార్కెట్ డేటా నాణ్యతను మెరుగుపరచడం, లేబర్ ఫోర్స్  నైపుణ్య స్థాయిని పెంచడం దీని లక్ష్యమని పేర్కొన్నారు.అంతకుమందు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించిన 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి రాష్ట్ర బడ్జెట్ పనితీరు నివేదికను కూడా కౌన్సిల్ సమీక్షించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com