WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం

- November 25, 2025 , by Maagulf
WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం

హైదరాబాద్: వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (WTITC) గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ వింగ్ సెక్రటరీగా ఫీనిక్స్ గ్రూప్ గ్రూప్ డైరెక్టర్ శ్రీకాంత్ బడిగని సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ ఏకగ్రీవంగా నియమించింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZs), ఫ్రీ ట్రేడ్ జోన్లు (FTZs), అంతర్జాతీయ వాణిజ్య దౌత్యం, గ్లోబల్ ఇండస్ట్రీ ఎంగేజ్‌మెంట్ రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన శ్రీకాంత్ బడిగ నియామకం ద్వారా WTITC అంతర్జాతీయ కార్యకలాపాలకు మరింత బలమెత్తినదిగా భావిస్తున్నారు. ఈ నియామకానికి సంబంధించి ఆయన ప్రమాణ స్వీకార వేడుక దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్న WTITC 2025లో నిర్వహించబడనుంది.

ఈ సందర్భంగా WTITC చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ, “WTITC ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరిస్తున్న ఈ సమయంలో, గ్లోబల్ ట్రేడ్ బాడీలు, ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీలు, పాలసీ సంస్థలతో పని చేయగల నాయకత్వం అత్యంత అవసరం. ఫీనిక్స్ గ్రూప్‌లోని శ్రీకాంత్ బడిగ గారి అనుభవం, SEZ/FTZ రంగాల్లో వారి పట్టు, గ్లోబల్ ఎకానమిక్ కనెక్టివిటీపై ఉన్న అవగాహన WTITCకు కొత్త దిశనందిస్తుంది. డుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఆయన ప్రమాణ స్వీకారం WTITCకు మరొక గర్వకారణమైన ఘట్టం కానుంది” అని తెలిపారు.

నియామకాన్ని అంగీకరిస్తూ శ్రీకాంత్ బడిగ మాట్లాడుతూ, “WTITC ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లు, స్టార్టప్స్, పరిశ్రమల మధ్య వాణిజ్య – పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం కీలకం. డుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ప్రమాణ స్వీకారం చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. WTITC యొక్క గ్లోబల్ మిషన్‌కు నేను సమర్థంగా సేవలందిస్తాను” అని పేర్కొన్నారు.

శ్రీకాంత్ బడిగ పదవీకాలం 31 డిసెంబర్ 2027 వరకు అమల్లో ఉంటుంది. WTITC 2025 డుబాయ్ కాన్ఫరెన్స్ సందర్భంగా అధికారిక ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com