ఏవియేషన్ హబ్‌గా భారత్
- November 26, 2025
హైదరాబాద్: భారత్ ఏవియేషన్ హాబ్ గా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరో పార్క్‌లో సాఫ్రాన్ ఏర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ హైదరాబాద్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…భారత ఏవియేషన్ రంగం గత కొన్నేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
ఇప్పటికే 1500కి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. భారత్‌లోనే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ MRO సెంటర్ ఏర్పాటు దేశానికి భారీ ప్రయోజనం చేకూరుస్తుందని, సాఫ్రాన్ సంస్థకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. MSMEలను ప్రోత్సహించే విధానంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారత్‌లో సాఫ్రాన్ యొక్క అతిపెద్ద MRO యూనిట్‌గా ఈ ఫెసిలిటీ నిలుస్తుందని, వేలాది మందికి స్కిల్డ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







