ఆగష్టు 5న విడుదల కానున్న 'చుట్టాలబ్బాయి'
- July 25, 2016
ఆది హీరోగా వీరభద్రం దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైనట్లు చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఆది, వీరభద్రం కాంబినేషన్లో చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న మా చుట్టాలబ్బాయి చిత్రాన్ని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ వారంలో ప్లాటీనం డిస్క్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నాం. అహ నా పెళ్ళంట, పూలరంగడు చిత్రాల తర్వాత వీరభద్రం రూపొందిస్తున్న మరో సూపర్‌హిట్ చిత్రమిది' అన్నారు.
ఈ చిత్రంలో ఆది సరసన నమిత ప్రమోద్ నటించారు. సాయికుమార్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







