ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..

- November 28, 2025 , by Maagulf
ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..

హైదరాబాద్: “అంతరిక్షాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి” అనే లక్ష్యంతో స్థాపించబడిన హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ స్వదేశీ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. భారత్‌లో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా గుర్తింపు పొందిన ఈ వాహనానికి భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం విక్రమ్-1(Vikram–1) అని పేరు పెట్టారు.

ఇప్పటి వరకు రాకెట్ నిర్మాణం ప్రధానంగా ఇస్రో ఆధ్వర్యంలోనే కొనసాగినప్పటికీ, కేంద్రం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు దారి తీసిన తర్వాత స్కైరూట్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విక్రమ్-1ని తయారు చేసి ప్రయోగానికి సిద్ధం చేస్తోంది.

స్కైరూట్ ఏరోస్పేస్ అంటే ఏమిటి?
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంలో లాంచ్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉపగ్రహం బరువును ఆధారంగా చేసుకుని అనుకూలమైన వెహికల్‌ను ప్రయోగిస్తారు. ఇస్రో పీఎస్ఎల్వీ(PSLV), జీఎస్ఎల్వీ(GSLV) వంటి వాహనాలను వినియోగిస్తుంది. ఇవిలో పీఎస్ఎల్వీ 1.4 టన్నుల వరకు, జీఎస్ఎల్వీ 4 నుంచి 6 టన్నుల వరకు ఉపగ్రహాలను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.

2020లో కేంద్ర ప్రభుత్వం స్పేస్ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడులకు తెరిచిన తర్వాత అనేక స్టార్టప్‌లు ఏర్పడ్డాయి. అయితే స్కైరూట్ ఏరోస్పేస్ దీనికి ముందే, 2018లోనే ఇస్రో మాజీ ఇంజినీర్లు పవన్ కుమార్ చందన్, భరత్ కుమార్ డాకా స్థాపించారు.

“ఆరంభంలో నిధులు తక్కువే. స్పేస్ రంగంపై దృష్టి కూడా అంతగా లేదు. కానీ ప్రభుత్వ సంస్కరణలు మా ప్రయాణానికి ఎంతో తోడ్పడ్డాయి,” అని పవన్ కుమార్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com