యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- November 28, 2025
యూఏఈ: ఇస్తాంబుల్‌లో ఎమిరాటీ గూఢచర్య కార్యకలాపాల ఆరోపణలను టర్కీ తోసిపుచ్చింది. ఈ మేరకు యూఏఈ ప్రకటించింది. యూఏఈ, యూఏఈ వాసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాల్లో లేరని టర్కిష్ అటార్నీ జనరల్ ధృవీకరించారని తెలిపింది. ఇస్తాంబుల్‌లో గూఢచర్య కార్యకలాపాల గురించిన కొన్ని మీడియా నివేదికలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
యూఏఈ గురించి అనుమానాలను రేకెత్తించేలా అవి ఉండటంతో యూఏఈ స్పందించింది. కాగా, అది నిజం కాదని వాటిని తొలగించాలని మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను టర్కిష్ అటార్నీ జనరల్ ఆదేశించారు.ఈ విషయంపై యూఏఈ అటార్నీ జనరల్ మరియు టర్కిష్ అటార్నీ జనరల్ టెలిఫోన్ ద్వారా చర్చించారు.మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరులు ఎటువంటి అనుమానాస్పద ప్రవర్తనను గమనించలేదని టర్కీ భద్రతా అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







