సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలు

- July 25, 2016 , by Maagulf
సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలు

 జపాన్‌లోని టోక్యోలో ఓ 26 ఏళ్ల యువకుడు కత్తితో అతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తాను పోలీసునంటూ చెప్పుకుంటూ నల్ల దుస్తులు ధరించి వికలాంగుల సౌకర్యార్ధం కేటాయించబడిన సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి విచక్షణ లేకుండా దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలయినట్టు తెలిసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 50 మందికి పైగా అతడి దాడిలో గాయపడ్డారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది.(భారత్‌ కాలమానం ప్రకారం) 2.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో ఇంటి బయట కనిపించినట్టు అక్కడి మీడియా నివేదించింది. అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com