ఇళ్లల్లో పని చేసే వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా
- July 25, 2016
ఇళ్లల్లో పని చేసే వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్రం ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్, దిల్లీలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తారు. కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ పథకాన్ని ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద యజమానులు నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. బీమా రక్షణలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబసభ్యుల చికిత్సకు అయ్యే వ్యయంపై గరిష్ఠ పరిమితి ఉండదు. పనిమనుషులు, డ్రైవర్లు, సంరక్షకులు, వంటమనుషులు తదితరులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా రక్షణ ఉంటుంది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో, డిస్పెన్సరీల్లో వారికి చికిత్స లభిస్తుంది. బీమా లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలేమీ ఉండవు. క్రమంగా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. జాతీయ పథకంగా విస్తరించిన తర్వాత దాదాపు 80లక్షల మందికి ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుందని కార్మిక మంత్రిత్వశాఖలోని ఒక అధికారి వెల్లడించారు. యజమానుల చెల్లింపు స్వచ్ఛందమేనని ఆ అధికారి చెప్పారు. వంటగ్యాస్ రాయితీని సంపన్నులు స్వచ్ఛందంగా వదిలేసుకోవాలని విజ్ఞప్తి చేసిన తరహాలోనే ఈ పథకం కింద యజమానులు తమ ఇంటిలో పని చేసే వారి బీమా కోసం చెల్లించాలని తర్వాత ప్రధాని మోదీ, మంత్రి దత్తాత్రేయ విజ్ఞప్తి చేస్తారని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







