రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- November 28, 2025
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల భారత పర్యటనకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు.డిసెంబర్ 4, 5 తేదీల్లో జరిగే 23వ భారత–రష్యా వార్షిక సదస్సులో పుతిన్ పాల్గొనడం ఖరారైంది.ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ, వాణిజ్య విస్తరణ, ఇంధన రంగ సహకారం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
భారత్–రష్యా సంబంధాలు
ఈ పర్యటనకు ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల మధ్య ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. రష్యా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో అమెరికా భారత్‌పై అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో పుతిన్ పర్యటన వ్యూహాత్మకంగా ముఖ్యమైందిగా భావిస్తున్నారు. ఇంధన భద్రత, గ్లోబల్ జీయోపాలిటిక్స్పై ఇరు దేశాలు స్పష్టమైన చర్చలు జరపనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్–రష్యా సంబంధాలు గత కొన్ని దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!
- ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!
- బహ్రెయిన్‌లో 8 ఇల్లీగల్ హెల్త్ సైట్స్.. 56 లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు..!!
- ఇన్స్టాగ్రామ్ లో మైనర్ పై అనుచిత చర్యలు..Dh5,000 ఫైన్..!!
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..
- సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు...
- రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీ ఎదురుదెబ్బ







