శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- November 28, 2025
గోవా: దక్షిణ గోవాలోని కనకోనా జిల్లా పార్టగల్ గ్రామంలో ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠాన్ని ఇవాళ ప్రధాని మోదీ సందర్శించారు. ఈ మఠం ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 77 అడుగుల ఎత్తు కలిగిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం.. భారతదేశంలోని అత్యంత పురాతన మఠాల్లో ఒకటి కావడం విశేషం. 370 సంవత్సరాల క్రితం పార్టగల్లో ఈ మఠాన్ని నిర్మించారు.ఈ మఠం 550 ఏళ్ల సంప్రదాయాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కార్యక్రమాలు...
గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. 550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ 7,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
గోవా పర్యటనకు ముందు, ప్రధాని మోదీ కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించారు. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన ‘లక్ష కంఠ గీతా పారాయణం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్ష మంది విద్యార్థులు, పండితులు, సన్యాసులు, సాధారణ పౌరులతో కలిసి భగవద్గీత శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ గర్భగుడి ఎదుట నిర్మించిన సువర్ణ తీర్థ మంటపాన్ని ప్రారంభించారు. అలాగే, కనకదాసు శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవిత్ర కిటికీ ‘కనకన కిండి’కి బంగారు కవచాన్ని (కనక కవచం) సమర్పించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







