70 రోజుల మెటర్నిటీ సెలవులు..!!
- November 29, 2025
మనామా: బహ్రెయిన్ ప్రభుత్వ రంగంలోని మహిళలకు డెబ్బై రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పార్లమెంటును తాకాయి. ఎంపీలు హనన్ ఫర్దాన్, జలీలా అలావి, బాసెమా ముబారక్ మరియు మరియం అల్ సేగ్ సౌదీ మరియు ఈజిప్టు చట్టాలకు అనుగుణంగా ప్రస్తుత 60 రోజుల మెటర్నీ లీవులను పొడిగించాలని ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు.
అలాగే,బహ్రెయిన్ తల్లికి తన బిడ్డకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు రోజుకు రెండు వేతనంతో కూడిన నర్సింగ్ అవర్స్ ను పొందుతారు. ఆమె ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను చూసుకోవడానికి, ఒకేసారి రెండు సంవత్సరాల వరకు మరియు ఆమె సర్వీస్ సమయంలో మూడు సార్లు సాలరీ లేని పిల్లల సంరక్షణ సెలవును కూడా పొందే అవకాశం ఉంది.
మరోవైపు, మెటర్నిటీ సెలవులను పొడిగించడం కారణంగా ప్రభుత్వ సంస్థల సాధారణ నిర్వహణపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని బ్యూరో పేర్కొంది. ఎందుకంటే ఎక్కువ కాలం గైర్హాజరు అయితే అదనపు సిబ్బంది ద్వారా లేదా పనిని ఎలా పంచుకోవాలో మార్పుల ద్వారా కవర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. సివిల్ సర్వీస్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు 57.5 శాతం ఉన్నారని, అధిక ఖర్చులు మరియు అదనపు ఖర్చులకు దారితీస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదన అమలుకు చట్టాల సవరణ అవసరమని వెల్లడించింది. త్వరలో బహ్రెయిన్ పార్లమెంట్ మెటర్నిటీ సెలవులపై చర్చిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







