థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి
- November 29, 2025
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరుగుతున్నాయి.ఒకవైపు భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం, క్లౌడ్ బరస్ట్, అధిక వర్షాలతో వరదలు, (Floods) సునామీ వంటివాటితో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు. తాజాగా థాయ్ లాండ్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
సౌత్ థాయ్ లాండ్ లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావానికి ఏకంగా 12 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అనేకమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యంతో థాయ్ లాండ్ చిగురుటాకులా ఒణికిపోతున్నది. ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి, తీవ్ర ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో శిధిలాలకింద ప్రజలు చిక్కుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల్లో చాలామంది చిక్కుకు పోయారు. దీంతో వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని
అధికారులు చెబుతున్నారు. రవాణ పూర్తి స్తంభించిపోవడంతో ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతాలకు సంబంధాలు కూడా తెగిపోయాయి. నదులు, చెరువులు వరద నీటితో నిండిపోయి, పలు ఇళ్ల వరదల్లో మునిగిపోయాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







