బహ్రెయిన్‌లో భారతీయ వ్యాపారవేత్త ఎల్.ఆర్. గజ్రియా మృతి..!!
- November 29, 2025
మనామా: ప్రసిద్ధ భారతీయ వ్యాపారవేత్త మరియు బహ్రెయిన్ వాణిజ్య రంగంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరైన లాల్‌చంద్ రతన్‌చంద్ గజ్రియా (ఎల్.ఆర్. గజ్రియా) మరణించారు. ఆయన గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం క్షిణించడంతో కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
1958లో యువకుడిగా బహ్రెయిన్‌కు చేరుకున్న ఆయన పరిమిత వనరులతో వాణిజ్య రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను దిగుమతి చేసుకోవడం మరియు విక్రయించడంలో ప్రత్యేకత కలిగిన గజ్రియా ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీని స్థాపించారు. ఆయన ఒక్క మెట్టు ఎక్కుతూ బహ్రెయిన్ లో తన వాణిజ్య కార్యకలాపాలను విస్తరించారు. వ్యాపారం పెరిగేకొద్దీ, కంపెనీ బహ్రెయిన్ మార్కెట్లో గుర్తింపు పొందిన బ్రాండ్‌గా మారింది. అనంతరం గజ్రియా హోల్డింగ్స్‌ను స్థాపించాడు. ఇది వివిధ రంగాలలో వివిధ రకాల వెంచర్‌లను నిర్వహించే పెద్ద వాణిజ్య సంస్థగా అవతరించింది.
వ్యాపారానికి మించి, గజ్రియా బహ్రెయిన్‌లోని భారతీయ కమ్యూనిటీలో చురుకైన సభ్యుడిగా ఉన్నారు. అతను కమ్యూనిటీ మరియు ఛారిటీ చొరవలకు మద్దతు ఇవ్వడంతోపాటు సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాల్లో తరచుగా పాల్గొంటారని ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు గుర్తు చేసుకున్నారు. 2024లో అతను బహ్రెయిన్‌లోని ఒక భారతీయ కమ్యూనిటీ సంస్థ నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
ఎల్.ఆర్. గజ్రియా మరణ వార్త విని ప్రముఖ ఆర్థిక మరియు కమ్యూనిటీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అతన్ని బహ్రెయిన్‌లోని అత్యంత ప్రముఖ భారతీయ వ్యాపార వ్యక్తులలో ఒకరిగా, సమాజ సేవతో వృత్తిపరమైన విజయాన్ని సాధించిన రోల్ మోడల్‌గా అభివర్ణించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







