వెరైటీ ఫిష్‌ సుర్మయ్‌

- July 18, 2015 , by Maagulf
వెరైటీ ఫిష్‌ సుర్మయ్‌

వెరైటీ ఫిష్‌ సుర్మయ్‌
కావలిసిన పదార్ధాలు
చేపముక్కలు - ఎనిమిది
పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం - ఒక పెద్దముక్క
వెల్లుల్లి - ఆరు రెబ్బలు
దనియాలు - రెండు స్పూన్లు
మిరియాలు - ఒక స్పూను
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నెయ్యి - ఒక స్పూను
ఎండుమిర్చి - మూడు(నీటిలో నానబెట్టాలి)
నూనె - తగినంత
ఆవాలు - ఒక స్పూను
తయారీ విధానం
ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు పట్టించేసి పక్కన పెట్టాలి. తరువాత దనియాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి తురుమూ, నానబెట్టిన ఎండుమిర్చి మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి మరిగాక, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, మిక్సీ వేసిన పేస్టును కూడా వేసి బాగా వేగాక కొద్దిగా నీళ్లు పోసి చేప ముక్కలు వేసి మూత పెట్టాలి. కాసేపటికి చేప ముక్కలు ఉడికి కూర సిద్ధమవుతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి అన్నంతో వడ్డిస్తే ఘమఘమలాడే ఫిష్‌ సుర్మయ్‌ రెడీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com