ఐఎస్‌ ఉగ్రవాదులు బెంగళూరులో..

- July 25, 2016 , by Maagulf
ఐఎస్‌ ఉగ్రవాదులు బెంగళూరులో..

బెంగళూరులో 200 మందికిపైగా ఐఎస్‌ ఉగ్రవాదులు తలదాచుకున్నారని రిటైర్డు ఏసీపీ టి.జి.సంగ్రామ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయచూరు జిల్లా గంగావతిలో ఆయన మాట్లాడుతూ.. ఐఎస్‌ ఉగ్రవాదులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. డీజీపీ, ఐజీపీలు ముందుకొస్తే సమాచారం ఇస్తానని తెలిపారు. కాగా.. ఐఎ్‌సతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ముగ్గురు యువకులపై ఎనఐఏ సోమవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన షేక్‌ అజహరుల్‌ ఇస్లామ్‌(24), కర్ణాటకకు చెందిన అద్నాన హసన(36), మహారాష్ట్రకు చెందిన మహ్మద్‌ ఫర్హాన షేక్‌(25)లను యూఏఈ నుంచి భారతకు వెనక్కి పంపించి వేయడంతో జనవరిలో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com