ఎంపీలతో సమాలోచనలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- November 30, 2025
విజయవాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు.డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో అనుసరించాల్సిన విధానాల పై దిశానిర్దేశం చేశారు.మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల JSP ఈ సమావేశంలో పాల్గొన్నారు.జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు పకడ్బందీగా సంసిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై, వివరాలు అందించాలన్నారు.రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతికి సంబంధించిన కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదన్నారు.రాష్ట్రంలో పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు,ఈ ఆర్ధిక సంవత్సరం రావాల్సిన నిధులు వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారని వాటిని పరిశీలించి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళాలి అన్నారు.
తాజా వార్తలు
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!







