సౌదీ హ్యూమటేరియన్..173 దేశాలకు $142 బిలియన్లు..!!
- November 30, 2025
లండన్: హ్యూమటేరియన్, దాతృత్వ రంగాలలో సౌదీ అరేబియా ప్రపంచానికి పెద్దన్నగా మారింది. ఇప్పటివరకు $142 బిలియన్లకు పైగా ఖర్చు చేసిందని,8,406 ప్రాజెక్టుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 173 దేశాలు ప్రయోజనం పొందాయని కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) సూపర్‌వైజర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ రబీహ్ వెల్లడించారు. లండన్‌లోని గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్‌లోని జాయెద్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్‌టు రేర్ డిసీజ్ ఇన్ చిల్డ్రన్‌లో మానవత్వం పై ఆయన ఉపన్యాసం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అగ్ర దాతలలో సౌదీ అరేబియా టాప్ ప్లేసులో ఉందన్నారు.
రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ మార్గదర్శకత్వంలో సౌదీ హ్యూమటేరియన్ వర్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని పొందిందని డాక్టర్ అల్-రబీహ్ పేర్కొన్నారు. 2015లో స్థాపించబడినప్పటి నుండి కెఎస్ రిలీఫ్ 109 దేశాలలో $8.25 బిలియన్లకు పైగా విలువైన 3,881 ప్రాజెక్టులను అమలు చేసిందన్నారు. ఇందులో ఆరోగ్యం, ఆహార భద్రత, విద్య మరియు నీరు వంటి కీలక రంగాలు ఉన్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







