ఫుట్ బాల్ అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్..!!
- November 30, 2025
దోహా: FIFA అరబ్ కప్ ఖతార్ 2025 అభిమానులకు దోహా మెట్రో బంపరాఫర్ ప్రకటించింది. టికెట్ హోల్డర్లకు దోహా మెట్రో ఉచితంగా ఉంటుందని సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ ప్రకటించింది. అభిమానులు మ్యాచ్ టిక్కెట్‌ను ఏదైనా దోహా మెట్రో స్టేషన్లో చూపించడం ద్వారా ఉచిత రైడ్లను పొందవచ్చని తెలిపారు. డిసెంబర్ 1 నుండి 18 వరకు ఖతార్ FIFA అరబ్ కప్ 2025ను నిర్వహిస్తున్నారు. మ్యాచులకు సంబంధించి ఇప్పటివరకు 7లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్టు నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







