టీమిండియా ఘన విజయం
- November 30, 2025
సౌత్ ఆఫ్రికా: టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి తేరుకున్న భారత జట్టు వన్డే సిరీస్‌లో (IND Vs SA) బోణీ కొట్టింది.17 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు నమోదు చేసింది. విరాట్ కోహ్లీ (135) శతకంతో మెరిశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రోహిత్ శర్మ (57) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.
వికెట్లు క్రమం తప్పకుండా కోల్పోతున్నప్పటికీ
ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకే ఆలౌటై పరాజయం చెందింది. వికెట్లు క్రమం తప్పకుండా కోల్పోతున్నప్పటికీ చివరివరకు పోరాట మనోభావం చూపింది. మాథ్యూ (72), యాన్సన్ (70), బాష్ (67) జట్లు నిలబెట్టే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో దాడి చేశారు. హర్షిత్ రాణా 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







