వెంకీ-త్రివిక్రమ్ సినిమాకు వింత టైటిల్..
- November 30, 2025
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్. ఈ సినిమాతో కుర్ర హీరోలకు సైతం సాధ్యం కానీ వసూళ్లను సాధించాడు ఈ హీరో. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో ఈ హీరో నుంచి వస్తున్న నెక్స్ట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళుతూ ఏకంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేశాడు వెంకటేష్. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తునట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక అప్పటినుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తెలుగు మూవీ లవర్స్. అయితే, గతంలో వెంకటేష్-త్రివిక్రం కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయి అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా రాబోతున్న సినిమా కూడా అదే లెవల్లో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, త్రివిక్రమ్ సినిమాలే కాదు ఆయన సినిమాల టైటిల్స్ కూడా భలే వింతగా ఉంటాయి. ఇప్పుడు వెంకటేష్ సినిమాకు కూడా వింత టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. మొన్నటివరకు వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆతరువాత అది కాస్త కుటుంబరావు గా మారింది. కానీ, ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాకు బంధుమిత్రుల అభినందనలతో అనే ఫ్యామిలీ టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ టైటిల్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. అలాగే ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ కూడా డిసెంబర్ లో మొదలుపెట్టి 2026 సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి చాలా గ్యాప్ తరువాత వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







