కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!

- December 01, 2025 , by Maagulf
కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!

కువైట్: కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవల జ్లీబ్ అల్-షుయౌఖ్‌లో 67 శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేశారు. దీంతో ఖైతాన్, అల్-ఫిర్దౌస్, అల్-అండలస్, అల్-రాబియా మరియు అల్-ఒమారియాతో సహా సమీపంలోని ప్రైవేట్ నివాస ప్రాంతాలకు ప్రవాస బ్యాచిలర్ కార్మికులు గణనీయంగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. నివాసితుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బ్యాచిలర్ హౌసింగ్‌ను అరికట్టే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

కువైట్ మునిసిపాలిటీ ఉల్లంఘనలను నియంత్రించడానికి, ప్రైవేట్ నివాస మరియు మోడల్ హౌసింగ్ జోన్‌ల పట్టణాల్లో భద్రతను కాపాడటానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ ఆపరేషన్స్ టీం సభ్యుడు ఇంజనీర్ ముహమ్మద్ అల్-జలావి ప్రకటించారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన 14 ఆస్తుల భవనానికి విద్యుత్తును నిలిపివేసినట్లు వెల్లడించారు. మరో 34 భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.   ప్రైవేట్ ప్రాంతాల్లో బ్యాచిలర్ హౌసింగ్‌ను నిశితంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక ఫీల్డ్ బృందాలను నియమించినట్టు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com