యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్‌ కే ఎందుకు?

- December 01, 2025 , by Maagulf
యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్‌ కే ఎందుకు?

యూఏఈ: బ్రిటిష్ లక్షాధికారులు మరియు బిలియనీర్లకు యూఏఈ నివాస కేంద్రంగా మారింది. యూఏఈ సమర్థవంతమైన పన్ను వ్యవస్థ, స్థిరమైన రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఇవన్నీ బిలియనర్లకు యూఏఈ స్వర్గధామంగా మారుతోంది.మరోవైపు పెరుగుతున్న UK పన్నులు మరియు కఠినమైన నిబంధనలు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులను దుబాయ్ వంటి ఇతర దేశాలకు తరలివస్తున్నారు.  

హెన్లీ & పార్టనర్స్ విడుదల చేసిన 2025 ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం..దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ క్యాపిటల్‌కు ప్రముఖ గమ్యస్థానంగా నిలిచింది.యూకే దాదాపు 16,500 మంది మిలియనీర్లను కోల్పోయింది. వారి సంపద $91.8 బిలియన్ల (Dh337 బిలియన్) ఉంటుందని అంచనా. రాబోయే రోజుల్లో యూఏఈ దాదాపు 9,800 మంది మిలియనీర్లను మరియు దాదాపు $63 బిలియన్లను ఆకర్షించనుంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 142,000 మంది మిలియనీర్లు వలస వెళ్లే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com