ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!

- December 04, 2025 , by Maagulf
ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!

రియాద్: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సౌదీల సంఖ్య దాదాపు 2.5 మిలియన్లకు పెరిగిందని సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి అహ్మద్ అల్-రాజి తెలిపారు. బుధవారం రియాద్‌లో జరిగిన బడ్జెట్ ఫోరం 2026లో ఆయన పాల్గొని వివరాలను వెల్లడించారు. కార్మిక మార్కెట్లో సౌదీ మహిళల భాగస్వామ్యం 2019లో 23 శాతంగా ఉండగా, ఇప్పుడు 34.5 శాతానికి చేరుకుందని ఆయన అన్నారు.  

2020లో ప్రారంభించబడిన లేబర్ మార్కెట్ లక్ష్యాలలో 92 శాతం అమలు చేసినట్లు తెలిపారు. ఇది సౌదీలలో నిరుద్యోగ రేటును ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో 6.8 శాతానికి తగ్గించడానికి దోహదపడిందని ఆయన తెలిపారు. ఇది 2019లో 12 శాతం నుండి తగ్గిందని, 2030 నాటికి 7 శాతానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 

జాతీయ స్థాయిలో ప్రతిభను పెంచడానికి ఇంజనీరింగ్, అకౌంటింగ్ మరియు ఫార్మసీ వంటి ప్రత్యేక రంగాలలో 30 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ లో స్థానిక స్టూడెంట్స్ సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు.  నిర్ణయాలను జారీ చేసిందని అల్-రాజి పేర్కొన్నారు. ఈ ట్రేడ్ లలో పనిచేసే సౌదీల సంఖ్య 100 శాతానికి పైగా పెరిగి, కొన్ని రంగాలలో 300 శాతానికి చేరుకుందని వెల్లడించారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com