'మన శంకరవరప్రసాద్ గారు' సెకండ్ సింగిల్ శశిరేఖ డిసెంబర్ 8న రిలీజ్
- December 04, 2025
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారులో నయనతార కథానాయికగా నటించింది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై శ్రీమతి అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంగీత ప్రయాణం ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో అద్భుతంగా ప్రారంభమైంది. ఇది 75 మిలియన్ల+ వ్యూస్‌ను సాధించింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్‌డేట్‌తో వచ్చారు.
సెకండ్ సింగిల్ టైటిల్ శశిరేఖ. పోస్టర్ సూచించినట్లుగా, ఫుట్-ట్యాపింగ్ బీట్‌లతో నిండిన మరో మెలోడియస్ ట్రాక్ అవుతుందని హామీ ఇస్తుంది. చిరంజీవి అద్భుతమైన ఎనర్జితో డ్యాన్స్ చేస్తూ అద్భుతమైన వైబ్‌ను జోడించింది. నయనతార స్టైలిష్ డ్యాన్స్ పోజ్ లో ఆకట్టుకున్నారు. తెరపై ఈ జంట అద్భుతంగా కనిపించనున్నారు. అందమైన పోర్ట్ నేపథ్యంలో ఆకట్టుకునే కెమిస్ట్రీ విజువల్ గా గొప్ప కొరియోగ్రఫీని సూచిస్తోంది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ పాట ప్రోమో డిసెంబర్ 6న విడుదల అవుతుంది. లిరికల్ వీడియో డిసెంబర్ 8న విడుదల అవుతుంది. పోస్టర్‌ను బట్టి చూస్తే, ఈ పాట కలర్ ఫుల్ విజువల్ ట్రీట్‌గా ఉంటుంది.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విక్టరీ వెంకటేష్ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నారు. ప్రొడక్షన్ పూర్తయ్యే దశకు చేరుకుంది. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కలిసి నటించిన మాస్ డ్యాన్స్ నంబర్ మరో మెయిన్ హైలైట్‌గా ఉండబోతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు.
2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







