సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- December 08, 2025
రియాద్: సౌదీ అరేబియాలో దాదాపు 95.7 శాతం మంది పెద్దలు తమ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కవరేజీని పొందుతున్నారు. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన 2025 జాతీయ ఆరోగ్య సర్వే ఫలితాలు వెల్లడించాయి.
15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి విషయానికొస్తే ఈ శాతం 98.3 శాతంగా ఉంది. 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 30.9 శాతం మంది తమ ఎలక్ట్రానిక్ వైద్య రికార్డులను ఆన్లైన్లో యాక్సెస్ చేశారని వెల్లడించింది. గత 12 నెలల్లో పెద్దలకు ఆరోగ్య సంరక్షణ విజిట్స్ సగటు సంఖ్య మూడు కాగా, 15 ఏళ్లలోపు పిల్లలలో ఇది 2.6గా ఉంది.
ఇక అనారోగ్యం, పోషకాహారం మరియు ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని పొందడానికి 30.8 శాతం మంది ఇంటర్నెట్ను ఉపయోగించారు. 5.7 శాతం మంది తమ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ను సంప్రదించడానికి టెలిహెల్త్ సేవలను ఉపయోగించుకున్నారు.
గత 12 నెలల్లో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ విజిట్స్ సగటు సంఖ్య సౌదీలలో 3.4 మరియు సౌదీయేతరులలో 2.4 గా ఉందని నివేదికలో తెలిపారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సగటు విజిట్స్ సంఖ్య 2.6 గా ఉంది.
గత 12 నెలల్లో 11.4 శాతం పెద్దలు డెంటల్ సంబంధిత కౌన్సిలింగ్ సేవలు పొందారని.. వీరిలో మహిళలు 15.1 శాతం, పురుషులు 9.4 శాతం ఉన్నారని జాతీయ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







