స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- December 08, 2025
అమరావతి: గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ ఆందోళన కలిగిస్తోంది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మహిళలు ఆదివారం మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరణించినవారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూరమ్మ (59), బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ (73) ఉన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లూరమ్మ నవంబర్ 28న జీజీహెచ్‌లో చేరారు. ఆమెకు ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తెలిసింది. నాగేంద్రమ్మ కూడా తీవ్ర జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికీ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇదే వ్యాధితో శనివారం రాత్రి మరొక మహిళ ధనమ్మ (64), ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన వారు, మరణించిన సంగతి తెలిసిందే.
ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 14 మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఫీల్డ్ స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు గ్రామాల్లో పర్యటిస్తూ లార్వా నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య







