ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- December 08, 2025
ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ల అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ, పూర్తిగా కొత్త AI డబ్బింగ్ టూల్‌ను విడుదల చేసింది. ఈ సదుపాయం ద్వారా ఒకే వీడియోను పలుభాషల్లోకి వెంటనే మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, కన్నడ భాషలకు డబ్బింగ్ సపోర్ట్ అందించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను చేరుకోవడం మరింత సులభం అయింది. ఈ ఫీచర్లో AI వాయిస్ మోడల్ మీ అసలు వాయిస్ టోను, ఫ్లో, స్టైల్‌ను అనుకరిస్తూ సహజమైన డబ్బింగ్‌ను రూపొందిస్తుంది. ఇంతకుముందు మాన్యువల్‌గా డబ్ చేసేందుకు తీసుకునే సమయం, ఖర్చు ఇప్పుడొక క్లిక్‌తో తగ్గిపోతుంది. ఒకే కంటెంట్‌ను వేర్వేరు భాషల ప్రేక్షకులకు చేరవేయాలనుకునే క్రియేటర్లకు ఇది నిజంగా గేమ్‌చేంజర్‌గా అన్నమాట.
AI డబ్బింగ్‌తో(AI Dubbing) పాటు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేటర్ల కోసం తాజా ఫాంట్ డిజైన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రీల్స్‌లో టెక్స్ట్ స్టైల్ మరింత యూనిక్‌గా, ప్రొఫెషనల్‌గా కనిపించేందుకు ఇవి సహాయపడతాయి. ముఖ్యంగా స్క్రిప్ట్ ఆధారిత కంటెంట్ లేదా ఇన్ఫర్మేటివ్ రీల్స్ చేసే క్రియేటర్లు ఈ ఫాంట్లను ఉపయోగించి తమ ప్రెజెంటేషన్ లెవల్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఇది కేవలం కంటెంట్ క్రియేషన్‌ను సులభతరం చేయడమే కాదు, మరింత ఎంగేజ్‌మెంట్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించే అప్డేట్గా భావిస్తున్నారు. టెక్స్ట్, విజువల్ ఎఫెక్ట్‌లతో పాటు భాషా డబ్బింగ్ కూడా సమన్వయంతో పనిచేయడం వల్ల రీల్స్‌కు మరింత రిచ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది.
ప్రేక్షకులకూ కొత్త ప్రయోజనం ఉంది. ఏ భాషలో ఉన్న రీల్నైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న సపోర్ట్డ్ లాంగ్వేజ్లలోకి మార్చుకొని చూడడం సాధ్యమైంది. ఇది భాషా అవరోధాలను తొలగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రత్యేకించి విద్యా సంబంధిత కంటెంట్, ట్యుటోరియల్స్, న్యూస్, ట్రెండ్స్ వంటి రీల్స్‌కు ఈ ఫీచర్ పెద్ద ప్లస్ అవుతుంది.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







