పుల్లెల గోపీచంద్ జీవిత కథతో రానున్న సుధీర్ బాబు
- July 26, 2016
'భలే మంచి రోజు' తర్వాత సుధీర్ బాబు నుండి మరో సినిమా ప్రకటన రాలేదు. ఈ గ్యాప్ లో బాలీవుడ్ సినిమా 'భాగీ' లో విలన్ రోల్ చేశాడు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. విలన్ గా సుధీర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడేమో అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమా పై ఫోకస్ పెట్టాడు, భారత బ్యాట్మెంటెన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవిత కథ ను తెరకెక్కించాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడు సుధీర్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటికే దీనిపై వర్క్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల ఈ సినిమాపై ఓ ప్రకటన చేసే అవకాశం వుంది. ప్రస్తుతం దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారట.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







