ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం

- December 08, 2025 , by Maagulf
ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం

న్యూ ఢిల్లీ: ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఎక్కువవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని UIDAI పౌరులకు కీలక సూచన ఇచ్చింది—మీ Aadhaar Authentication హిస్టరీని క్రమం తప్పకుండా పరిశీలించాలని పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా మీ ఆధార్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సేవ కోసం ఉపయోగించబడిందో తెలుసుకోవచ్చు. మీ అనుమతి లేకుండా ఇతరులు మీ ఆధార్ వాడుతున్నారా అన్నదీ స్పష్టంగా గుర్తించవచ్చు.

UIDAI ప్రకారం, ఈ ప్రక్రియను ప్రతి కొన్ని నెలలకు ఒకసారి పరిశీలించడం ద్వారా సైబర్ ఫ్రాడ్ అవకాశాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్, సిమ్ కార్డ్‌, సబ్సిడీలు, ఆన్‌లైన్ సేవల్లో ఆధార్ వినియోగం ఎక్కువగా ఉన్నందున ఆధార్ సెక్యూరిటీపై పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉందని స్పష్టం చేసింది.

ఆధార్ Authentication History ఎలా చెక్ చేయాలి?
ఆధార్ హిస్టరీని చెక్ చేయడం చాలా సులభం. కేవలం కొన్ని నిమిషాల్లో మొత్తం వివరాలను తెలుసుకోవచ్చు.

స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్:

  • My Aadhaar Portal ను సందర్శించండి.
  • ఆధార్ నంబర్, క్యాప్చా, OTP సహాయంతో లాగిన్ అయి మీ ఖాతాలోకి వెళ్లాలి.
  • డ్యాష్‌బోర్డ్‌లో కనిపించే “ధృవీకరణ చరిత్ర ” ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
  • గత 6 నెలల్లో మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడబడిందో పూర్తిగా చూపిస్తుంది.
  • మీకు తెలియని ఎంట్రీలుంటే వెంటనే UIDAIకు ఫిర్యాదు చేయవచ్చు.                                                                                                                                                    ఈ ఫీచర్ ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని ముందుగానే గుర్తించి, మీ వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండేలా చూసుకోవచ్చు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com