చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!

- December 09, 2025 , by Maagulf
చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!

రియాద్: ఆటోమోటివ్ బ్యాటరీల దిగుమతులపై సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చైనా, మలేషియా ఎగుమతి చేసే ఆటోమోటివ్ బ్యాటరీల దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని జీసీసీ దేశాలు నిర్ణయించాయి.

గల్ఫ్ సహకార మండలి (GCC) రాష్ట్రాల పరిశ్రమ మంత్రులతో కూడిన మంత్రివర్గ కమిటీ ఈ విషయంలో అంతర్జాతీయ వాణిజ్యంలో హానికరమైన పద్ధతులను ఎదుర్కోవడానికి GCC స్టాండింగ్ కమిటీ జారీ చేసిన సిఫార్సును ఆమోదించింది. GCC దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సాధారణంగా ఆటోమోటివ్ స్టార్టర్ బ్యాటరీలను లెడ్-యాసిడ్ ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్లు, పిస్టన్ ఇంజిన్లలో ఉపయోగిస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com