తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- December 10, 2025
హైదరాబాద్: తెలంగాణను స్టార్టప్‌లకు కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో(TG) యూనికార్న్ కంపెనీలుగా ఎదిగే స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్టార్టప్‌లను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ₹1,000 కోట్ల భారీ స్టార్టప్ ఫండ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించిన గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ఈ ఫండ్‌తో రాష్ట్ర స్టార్టప్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. స్టార్టప్‌లు విజయవంతం కావాలంటే సమిష్టి కృషి, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. ఫుట్‌బాల్ ఉదాహరణ ఇస్తూ… జట్టు భావన, పట్టుదలతో పనిచేసినప్పుడు విజయం సాధ్యమవుతుందని, అదే తత్వం స్టార్టప్‌లకు కూడా వర్తిస్తుందని చెప్పారు. గూగుల్ కంపెనీ ఎలా ఒక చిన్న గ్యారేజీ నుంచి ప్రపంచ దిగ్గజంగా ఎదిగిందో గుర్తు చేస్తూ, తెలంగాణ యువత కూడా పెద్ద కలలు కనాలని, వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,(TG) టీ-హబ్, ఇతర ఇన్క్యుబేటర్లను మరింత అభివృద్ధి చేసి, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించే ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడం కూడా ఈ లక్ష్యానికే భాగమని చెప్పారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దొరికిందని అన్నారు. భవిష్యత్తులో యువతకు భారీ అవకాశాలు లభించేలా పథకాలను అమలు చేస్తామని, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యాలు తెలంగాణ అభివృద్ధికి దోహదం చేస్తాయని సీఎం తెలిపారు. ఇదే సందర్భంలో, గ్లోబల్ సమ్మిట్‌పై పూర్తి నివేదికను అందజేయడానికి తాను ఢిల్లీకి వెళ్లనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్‌లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









