కువైట్లో నేడు క్లాసెస్ రద్దు..!!

- December 11, 2025 , by Maagulf
కువైట్లో నేడు క్లాసెస్ రద్దు..!!

కువైట్: భారీ వర్షాలు నేపథ్యంలో కువైట్లో తరగతులను రద్దు చేశారు.ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిర్ణయం దేశంలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపింది.

విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి ఇంజనీర్ సయ్యద్ జలాల్ అల్- తళ్తాబాయి ఉత్తర్వులను జారీ చేశారు.వాతావరణ పరిస్థితులను సూచిస్తూ వాతావరణ శాఖ నివేదికలను సమీక్షించిన తరువాత ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.దీంతో నేడు జరగాల్సిన అన్ని ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com