గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!

- December 11, 2025 , by Maagulf
గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!

యూఏఈ: రాస్ అల్ ఖైమా 2026లో రికార్డు స్థాయిలో నూతన సంవత్సర వేడుకలతో వెలిగిపోనుంది.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచేలా 15 నిమిషాల పాటు ఫైర్ వర్క్స్ ను  ఆరు కిలోమీటర్ల తీరప్రాంతంలో నిర్వహించనున్నారు. కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా అతిపెద్ద సింగిల్ ఫైర్ వర్క్స్ ప్రదర్శనగా ఇది రికార్డు సృష్టించనుంది. 2,300 కంటే ఎక్కువ డ్రోన్లు, పైరోటెక్నిక్‌లు మరియు లేజర్‌లతో మార్జన్ ద్వీపం మరియు అల్ హమ్రా ప్రాంతాలు రాత్రి సమయంలో రికార్డుల మోత మోగించనున్నాయి. రాత్రి 8 గంటలకు మరియు అర్ధరాత్రి సమయంలో మొత్తంగా రెండు ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.     


ఇక అల్ హమ్రాలో ఫ్రీ ఎంట్రీ కలిగిన రాస్ అల్ ఖైమా నూతన సంవత్సర వేడుకలు మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతాయి. అన్ని వయసుల వారి కోసం ఫుడ్ ట్రక్కులు, కార్నివాల్ గేమ్‌లు మరియు వినోద కార్యకలాపాలు అందుబాటులో ఉంటాయి.   

సందర్శకులు తమ వాహనాలను www.raknye.com లో ముందుగానే నమోదు చేసుకోవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైర్ వర్క్స్ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  

రాస్ అల్ ఖైమా గత ఏడు సంవత్సరాలలో 13 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఫైర్ వర్క్స్ ప్రదర్శన ఇప్పటివరకు జరుగని రీతిలో గిన్నిస్ రికార్డుల మోత మోగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com