యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!

- December 12, 2025 , by Maagulf
యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!

యూఏఈ: యూఏఈ ఫెడరల్ అథారిటీ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరంలోని తొలిరోజు జనవరి 1ని పెయిడ్ హాలీడేగా ప్రకటించింది. జనవరి 2న ప్రభుత్వ ఉద్యోగులకు రిమోట్-వర్క్ డే గా ఉంటుందని సర్క్యులర్ లో తెలిపింది. మరోవైపు యూఏఈలో వేడుకలతో కొత్త సంవత్సారానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. రాస్ అల్ ఖైమాలో 2,300 కంటే ఎక్కువ డ్రోన్లు, పైరోటెక్నిక్‌లు మరియు లేజర్‌లను ఉపయోగించి 6 కిలోమీటర్ల తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్ వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు అతిపెద్ద సింగిల్ ఫైర్ వర్క్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.  
ఇతర ఎమిరేట్స్ కూడా ఉత్సాహభరితమైన వేడుకలకు సిద్ధమవుతున్నాయి. దుబాయ్‌లో, నూతన సంవత్సర వేడుకలలో గ్లోబల్ విలేజ్, అట్లాంటిస్ ది పామ్ మరియు బ్లూవాటర్స్ ఐలాండ్ వంటి ప్రదేశాలలో ఫైర్ వర్క్, డ్రోన్ ప్రదర్శనలు, మ్యూజిక్ కాన్సర్టులు మరియు బీచ్ పార్టీలు ఆహ్వానం పలుకుతున్నాయి.

అబుదాబి షేక్ జాయెద్ ఫెస్టివల్ నివాసితులు మరియు సందర్శకులను నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఫైర్ వర్క్, డ్రోన్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన అయిన అల్ వాత్బాలో అపూర్వమైన 62 నిమిషాల ఫైర్ వర్క్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ ప్రదర్శన రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com