యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- December 12, 2025
యూఏఈ: యూఏఈ ఫెడరల్ అథారిటీ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరంలోని తొలిరోజు జనవరి 1ని పెయిడ్ హాలీడేగా ప్రకటించింది. జనవరి 2న ప్రభుత్వ ఉద్యోగులకు రిమోట్-వర్క్ డే గా ఉంటుందని సర్క్యులర్ లో తెలిపింది. మరోవైపు యూఏఈలో వేడుకలతో కొత్త సంవత్సారానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. రాస్ అల్ ఖైమాలో 2,300 కంటే ఎక్కువ డ్రోన్లు, పైరోటెక్నిక్‌లు మరియు లేజర్లను ఉపయోగించి 6 కిలోమీటర్ల తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్ వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు అతిపెద్ద సింగిల్ ఫైర్ వర్క్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇతర ఎమిరేట్స్ కూడా ఉత్సాహభరితమైన వేడుకలకు సిద్ధమవుతున్నాయి. దుబాయ్‌లో, నూతన సంవత్సర వేడుకలలో గ్లోబల్ విలేజ్, అట్లాంటిస్ ది పామ్ మరియు బ్లూవాటర్స్ ఐలాండ్ వంటి ప్రదేశాలలో ఫైర్ వర్క్, డ్రోన్ ప్రదర్శనలు, మ్యూజిక్ కాన్సర్టులు మరియు బీచ్ పార్టీలు ఆహ్వానం పలుకుతున్నాయి.
అబుదాబి షేక్ జాయెద్ ఫెస్టివల్ నివాసితులు మరియు సందర్శకులను నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఫైర్ వర్క్, డ్రోన్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన అయిన అల్ వాత్బాలో అపూర్వమైన 62 నిమిషాల ఫైర్ వర్క్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ ప్రదర్శన రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!







