యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- December 12, 2025
మనామా: భారత దీపాల పండుగ దీపావళి యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరింది. భారత రాజధాని న్యూఢిల్లీలో సమావేశమైన ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ 78 దేశాల నుండి డజన్ల కొద్దీ నామినేషన్లను పరిశీలిస్తోంది. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా, లక్షలాది మంది భారతీయులు జరుపుకునే పండుగగా దీపావళికి ప్రత్యేకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపింది. సిక్కు మరియు జైన మత వర్గాలకు చెందిన వారితో సహా చాలా మంది దీనిని ఐదు రోజుల పండుగగా పాటిస్తారని, ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యునెస్కో జాబితాలో దీపావళి చేరడం "ఆనందకరమైన క్షణం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







