'దేవి' సెప్టెంబరు 9న

- July 26, 2016 , by Maagulf
'దేవి' సెప్టెంబరు 9న

చిత్ర పరిశ్రమలోని తారలకు 'తొమ్మిది' అంటే అభిమానం ఎక్కువ. ఇదే కోవలో సెప్టెంబరు తొమ్మిదో తేదీన తమ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతోంది 'దేవి' చిత్ర యూనిట్‌. విజయ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్నారు. ప్రభుదేవా సొంత బ్యానరైన 'ప్రభుదేవా స్టూడియోస్‌', గణేశ్‌ నిర్మాణంలోని 'ఆరా సినిమాస్‌' సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కొనసాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇది ఓ భిన్న కథని దర్శకుడు విజయ్‌ చెప్పారు. అందరి సహకారంతో మూడు భాషల్లోనూ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com