'ఇరుముగన్' లో నయనతార పోలీసుగా..
- July 26, 2016
తన అందంతోనే కాదు.. నటనతోనూ దక్షిణాది పరిశ్రమను ఆకట్టుకుంటోంది మలబార్ భామ నయనతార. ఆరంభంలో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడలేదీ అమ్మడు. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకే పెద్దపీట వేస్తోంది. అలా ఇటీవల నటించిన 'మాయ', 'నానుం రౌడీదాన్' ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం విక్రం సరసన 'ఇరుముగన్' చేస్తోంది. ఇందులో ఆమె పోలీసు అధికారిణిగా నటించడం విశేషం. ఈ తరహా పాత్రకోసం చాలా కాలం వేచిచూసిందట. దర్శకుడు కథ చెప్పిన వెంటనే ఒప్పుకుందని సమాచారం. పోరాట సన్నివేశాల్లోనూ ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విజయశాంతిని గుర్తుకుతెచ్చేలా కొన్ని సీన్లు చిత్రీకరించారట దర్శకుడు ఆనంద్ శంకర్. 'ఇరుముగన్' విడుదలైన తర్వాత నయనతారకు సరికొత్త గుర్తింపు లభిస్తుందని దర్శకుడు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







