బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- December 12, 2025
మనామా: బహ్రెయిన్‌లోని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో, అభిమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో డిసెంబర్ 11, 2025న డానా మాల్‌లోని ఎపిక్స్ సినిమాస్‌లో ఘనంగా జరిగింది.ముందుగా సినిమా వాయిదా కారణంగా NBK అభిమానుల్లో నిరుత్సాహం నెలకొన్నప్పటికీ, కొత్త విడుదల తేదీ వెల్లడించగానే అదే ఉత్సాహం మరింత రెట్టింపై, భారీ సంఖ్యలో హాజరై తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.
అభిమానుల కేకలు, నినాదాలతో ఎపిక్స్ థియేటర్ సందడి చేసిందని నిర్వాహకులు తెలిపారు. బాలయ్యపై ప్రేమ, అభిమానంతో ఒకే చోటుకు చేరిన అభిమానులు ఈ ప్రీమియర్‌ను పండుగలా మార్చారు.
ఎన్నేళ్లుగా బహ్రెయిన్‌లోని NBK అభిమానులు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అదే ఉత్సాహంతో నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రీమియర్ షో అభిమానులకు మరువలేని అనుభవాన్ని అందించింది.కార్యక్రమంలో జరిపిన కేక్ కటింగ్ వేడుక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినవారు రామ మోహన్, హరిబాబు, రఘునాథ బాబు, సతీశ్ శెట్టి, నాగార్జున అంబటి, ఇంటియాజ్ అహ్మద్, ఆరే అనిల్, మౌలి చౌదరి, వంశీ చౌదరి, సందీప్, రామకృష్ణ, పూర్ణ, సతీశ్ బొల్ల, అశోక్ గణపర్తి, షణ్ముఖ్, సతీష్ రావూరి, చంద్రబాబు, అనిల్ పి., అశోక్, డి.శ్రీనివాస్ రావు, కిషోర్ కుమార్ పి., విజయ్ కృష్ణతో పాటు, సౌదీ అరేబియా నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నుండి వర ప్రసాదు నాయకత్వంలో భారీగా అభిమానులు పాల్గొన్నారు.
బహ్రెయిన్‌లోని NBK అభిమానులు, వారి కుటుంబాలు, అక్కడి తెలుగు సమాజం పెద్ద ఎత్తున హాజరై ఈ ప్రత్యేక ప్రీమియర్ షోను విజయవంతంగా నిర్వహించారు.ఉచితంగా షోను అందించడం ద్వారా NBK ఫ్యాన్స్ అసోసియేషన్ తమ అభిమానాన్ని, ఆరాధ్య నటుడిపై తమ ప్రేమను మరోసారి ప్రతిభావంతంగా ఆవిష్కరించింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







