ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

- December 12, 2025 , by Maagulf
ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

హైదరాబాద్: తెలంగాణ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (HISFF) తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఫెస్టివల్‌కు సంబధించిన ప్రమోషన్ ఈవెంట్స్ మొదలుపెట్టారు.ఈ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ను టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక కలసి ఆవిష్కరించారు. టూరిజం భవనం పై ప్రచార బెలున్‌లను కూడా ఎగురవేశారు. ఏడు వందలపైగా వివిధ దేశాల నుంచి సైతం వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా టూరిజం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ వేదికగా ఎదిగిందని, యూరప్, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి 700కి పైగా చిత్రాలు రావడం హర్షించదగిన విషయమని అన్నారు. నూతనంగా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే యువతీ యువకులకు ఇదొక గొప్ప వేదిక అవుతుందనని ఆమె అన్నారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బృందాన్ని అభినందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి వారు చేసిన అవిశ్రాంత కృషిని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్‌లో అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందినిసిన ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రదర్శనకు అధికారికంగా ఎంపికైన 60 మంది చిత్రనిర్మాతలందరికీ ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, అంకురం దర్శకుడు ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ.. డిసెంబర్ 19,20,21 తేదీల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీ‌సీ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com