2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!

- December 12, 2025 , by Maagulf
2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!

యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రెసిడెన్సీ, బిజినెస్ గమ్యస్థానాలలో యూఏఈ ఒకటిగా కొనసాగుతోంది. ప్రభుత్వం వివిధ వీసా పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఎప్పటికప్పుడు వాటికి సవరణలు చేస్తోంది.  2025లోనే, యూఏఈ గోల్డెన్ వీసా మరియు విజిట్ వీసా పథకాల కింద కొత్త వర్గాలను యాడ్ చేసింది.  2025లో అత్యంత ముఖ్యమైన వీసా నియమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.  

నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు
సెప్టెంబర్‌లోయూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) ద్వారా నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వినోదం, ఈవెంట్‌లు, క్రూయిజ్ షిప్‌లు మరియు లగ్జరీ యాచ్‌లలో నిపుణులకు మంజూరు చేయడానికి ఉద్దేశించి అమల్లోకి తీసుకొచ్చారు.  

విజిట్ వీసా కోసం స్పాన్సర్‌లకు సాలరీలో మార్పులు
విజిట్ వీసాపై స్నేహితుడు లేదా బంధువును స్పాన్సర్ చేసే యూఏఈ నివాసితులు కనీస నెలవారీ సాలరీ అవసరాలను తీర్చాలని సెప్టెంబర్‌లో ప్రకటించారు. సంబంధాన్ని బట్టి, నివాసితులు వారి సందర్శనలను స్పాన్సర్ చేయడానికి Dh4,000, Dh8,000 లేదా Dh15,000 సంపాదించాలి.

భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ విస్తరణ
ఫిబ్రవరిలో యూఏఈ భారతీయ పౌరుల కోసం వీసా-ఆన్-అరైవల్ కార్యక్రమాన్ని విస్తరించింది. దీని కోసం ఆరు దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు సింగపూర్ నుండి చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు కలిగిన సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న భారతీయ పౌరులు యూఏఈ లో వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం US, యూరోపియన్ యూనియన్ లేదా UK నుండి చెల్లుబాటు అయ్యే వీసా, నివాస అనుమతి లేదా గ్రీన్ కార్డ్ కలిగి ఉంటే భారతీయ పౌరులకే అందుబాటులో ఉంది. 

వీసా పునరుద్ధరణ ట్రాఫిక్ జరిమానా చెల్లింపులకు లింక్  
జూలైలో, అధికారులు దుబాయ్‌లో ట్రాఫిక్ జరిమానా చెల్లింపులను రెసిడెన్సీ వీసాలను జారీ చేసే లేదా పునరుద్ధరించే ప్రక్రియకు అనుసంధానించే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. కొత్త వ్యవస్థ ప్రకారం, నివాసితులు తమ వీసా పునరుద్ధరణ లేదా జారీ విధానాలను పూర్తి చేయడానికి ముందు ఏవైనా బకాయి ఉన్న ట్రాఫిక్ జరిమానాలను పూర్తిగా చెల్లించాలి.

నర్సులకు గోల్డెన్ వీసా
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి మరియు యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు దుబాయ్ హెల్త్‌లో పనిచేస్తున్న మరియు 15 సంవత్సరాలకు పైగా సేవలందించిన నర్సుల కోసం దుబాయ్ గోల్డెన్ వీసాను ప్రారంభించింది.

కంటెంట్ క్రియేటర్లకు గోల్డెన్ వీసా
కంటెంట్ సృష్టికర్తల కోసం దుబాయ్ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాను ప్రారంభించింది. ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, పాడ్‌కాస్టర్లు మరియు విజువల్ ఆర్టిస్టులతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉండే కంటెంట్ క్రియేటర్లు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడం ద్వారా క్రియేటర్స్ హెచ్‌క్యూ వెబ్‌సైట్ ద్వారా గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

గోల్డెన్ వీసా హోల్డర్లకు కొత్త కాన్సులర్ సేవలు
అక్టోబర్ లో అత్యవసర పరిస్థితుల్లో విదేశాలలో సహాయం అందించడానికి గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కాన్సులర్ సేవలను ప్రకటించింది.  విపత్తులు మరియు సంక్షోభాల సమయంలో లేదా అసాధారణ పరిస్థితులలో అవసరమైన మద్దతును అందించడానికి ప్రత్యేక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.  

బ్లూ రెసిడెన్సీ వీసా
బ్లూ రెసిడెన్సీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి వలసదారుల కోసం యూఏఈ 180 రోజుల అనుమతిని ప్రారంభించింది.  పర్యావరణాన్ని పరిరక్షించడంలో అసాధారణమైన సహకారం అందించిన వ్యక్తులకు 10 సంవత్సరాల నివాస అనుమతిని మంజూరు చేస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com