ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- December 12, 2025
దోహా : ప్రపంచ సమ్మిట్ AI - ఖతార్ 2025లో 14 కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసిన 20 కి పైగా జాతీయ AI-ఆధారిత ప్రాజెక్టులను ‘ఖతార్ AI పెవిలియన్’ లో భాగంగా ప్రదర్శిస్తున్నారు. ఈ పెవిలియన్, ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఖతార్ సాధించిన గణనీయమైన పురోగతిని మరియు ఖతార్ నేషనల్ విజన్ 2030తో అధునాతన డిజిటల్ భవిష్యత్తును ఒకే చోట చూసే అవకాశం ఉందని తెలిపారు.
ప్రభుత్వ AI ప్రోగ్రామ్ మద్దతుతో కూడిన సమగ్ర ప్రాజెక్టుల సమితిని ఖతార్ AI పెవిలియన్ ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. కార్మిక మార్కెట్ కార్యాచరణ సామర్థ్యం మెరుగుపరిచే అనేక AI మెషినరీ లెర్నింగ్ సాధనాలను ఒకేచోట చూడవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సందర్భంగా మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తన AIతో కూడిన బిల్డింగ్ పర్మిట్ సిస్టమ్‌ను ప్రదర్శించింది. ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్లను డిజిటల్‌గా విశ్లేషిస్తుంది. అవసరమైన డేటాను సంగ్రహిస్తుంది, పర్మిట్ జారీ సమయాన్ని సుమారు రెండు గంటలకు తగ్గిస్తుందని, ఇది అందరిని ఆకట్టుకుంటుందని ఖతార్ AI పెవిలియన్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







