GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- December 12, 2025
జెద్దా: జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) తన "ఎలైట్" (అల్-నుఖ్బా) ట్రైనింగ్ 10వ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఇటీవల పట్టభద్రులైన సౌదీల నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం. వారు జాబ్ మార్కెట్లో పోటీ పడగల అర్హత కలిగిన నిపుణులుగా మారడానికి వారిని సిద్ధం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఆరు నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివిధ GOSI విభాగాలలో శిక్షణ ప్రముఖ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లతో పాటు, అగ్రశ్రేణి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అధునాతన విద్యా కార్యక్రమాలను కలిపి అందిస్తుందని తెలిపారు. ఈ సమగ్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్ వృత్తిపరమైన కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుందన్నారు.
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను యాక్చురియల్ సైన్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ మరియు రిస్క్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అకౌంటింగ్, ఫైనాన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, లా, డిజిటల్ మీడియా, మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్ వంటి కీలక రంగాలలో గ్రాడ్యుయేట్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ







