ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!

- December 12, 2025 , by Maagulf
ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!

దోహా : ప్రపంచ సమ్మిట్ AI - ఖతార్ 2025లో 14 కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసిన 20 కి పైగా జాతీయ AI-ఆధారిత ప్రాజెక్టులను ‘ఖతార్ AI పెవిలియన్’ లో భాగంగా ప్రదర్శిస్తున్నారు.  ఈ పెవిలియన్, ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఖతార్ సాధించిన గణనీయమైన పురోగతిని మరియు ఖతార్ నేషనల్ విజన్ 2030తో అధునాతన డిజిటల్ భవిష్యత్తును ఒకే చోట చూసే అవకాశం ఉందని తెలిపారు. 

ప్రభుత్వ AI ప్రోగ్రామ్ మద్దతుతో కూడిన సమగ్ర ప్రాజెక్టుల సమితిని ఖతార్ AI పెవిలియన్ ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. కార్మిక మార్కెట్ కార్యాచరణ సామర్థ్యం మెరుగుపరిచే అనేక AI మెషినరీ లెర్నింగ్ సాధనాలను ఒకేచోట చూడవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ సందర్భంగా మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తన AIతో కూడిన బిల్డింగ్ పర్మిట్ సిస్టమ్‌ను ప్రదర్శించింది. ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్‌లను డిజిటల్‌గా విశ్లేషిస్తుంది. అవసరమైన డేటాను సంగ్రహిస్తుంది, పర్మిట్ జారీ సమయాన్ని సుమారు రెండు గంటలకు తగ్గిస్తుందని, ఇది అందరిని ఆకట్టుకుంటుందని ఖతార్ AI పెవిలియన్ నిర్వాహకులు తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com