భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు

- December 12, 2025 , by Maagulf
భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు

గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. భారత పౌరసత్వం విషయంలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఈ డేటాను వెల్లడించారు.

గణాంకాలు: పెరుగుతున్న విదేశీ పౌరసత్వాల సంఖ్య
భారత పౌరసత్వాన్ని వదులుకునే వ్యక్తుల వార్షిక రికార్డులను ప్రభుత్వం భద్రపరుస్తోందని మంత్రి తెలిపారు. ఆ రికార్డుల ప్రకారం:

  • 2011 నుండి 2019 మధ్య కాలంలో 11,89,194 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
  • గత 14 సంవత్సరాలలో 20 లక్షలకు పైగా ప్రజలు భారత (India) పౌరసత్వాన్ని వదులుకున్నారు.
  • విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గల్ఫ్‌లో ఉద్యోగాల పేరిట మోసం: యువతకు హెచ్చరిక

విదేశాలలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న పలువురు భారత యువతీ యువకులు మోసపూరిత ఉద్యోగ ఆఫర్ల బారిన పడుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల కోసం భారత యువత నకిలీ గల్ఫ్ ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులై అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల బారిన పడుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి కేసులు తమ దృష్టికి వచ్చాయని, ఇందులో చాలా వరకు సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ఆఫర్లను నమ్మడంతోనే ప్రారంభమవుతోందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com