ఈ యాప్‌తో స్పామ్‌ కాల్స్‌కు అడ్డుకట్ట

- July 26, 2016 , by Maagulf
ఈ యాప్‌తో స్పామ్‌ కాల్స్‌కు అడ్డుకట్ట

 అనవసరమైన కాల్స్‌తో (స్పామ్‌ కాల్స్‌) వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారని తెలుసుకున్న గూగుల్‌ సంస్థ ఇన్‌బిల్ట్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌ తయారు చేయనుంది. ఇక నుంచి ఫోన్‌ నంబర్ల లిస్ట్‌లో లేని, పదే పదే కాల్‌ చేస్తు విసిగిస్తున్న నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ను గుర్తించి వెంటనే రెడ్‌ బ్యానర్‌తో ఆ నంబరు ప్రత్యక్షమవుతుంది. ఆ కాల్‌ అనవసరమని వినియోగదారుడు భావిస్తే వెంటనే ప్రత్యక్షమైన రెడ్‌ బ్యానరు దగ్గర గల బ్లాక్‌ లిస్ట్‌ ఆప్షన్‌లో చేర్చవచ్చు.ఇంత వరకు వేరే కంపెనీలు తయారు చేసిన యాప్స్‌ వినియోగంలో ఉన్నప్పటికీ గూగుల్‌ కొత్తగా మరో యాప్‌ను విడుదల చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com