తెలంగాణ సాయిలు సౌదీలో తిప్పలు ..
- July 26, 2016
మండలంలోని నల్లవెల్లికి చెందిన గూండ్ల గడ్డమీది సాయిలు(35) సౌదీ అరేబియా దేశంలోని దమామ్ నగరంలో తప్పిపోయి తిప్పలు పడుతున్నాడు. కుటుంబ భారాన్ని పోషించేందుకు ఆరేళ్ల క్రితం కూలీ పని చేసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఇతడికి వీసా ఇచ్చిన కంపెనీ వారు ఎవరూ రాకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో దిగి తప్పి పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. సాయిలుకు తల్లీ సాయవ్వ, భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
సౌదీ అరేబియాలో రోడ్డు వెంట దొరికింది తింటూ బతుకుతున్నట్లు సాయిలు భార్యకు రెండు సార్లు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. తమ భర్తను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. కుటుంబ పెద్ద దిక్కు లేక తాము పూట గడవని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు సాయిలును రప్పించి తమను కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







